Chandrababu: జీవో నెం.3ని రద్దు చేసిన వ్యక్తికి ఓటు వేయకూడదు

AP Elections 2024: ఈ ఎన్నికల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు అన్నారు.

Arun Chilukuri
Updated on: 9 May 2024 6:15 PM IST
Chandrababu Speech in Kurupam
X

Chandrababu: జీవో నెం.3ని రద్దు చేసిన వ్యక్తికి ఓటు వేయకూడదు

AP Elections 2024: ఈ ఎన్నికల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నాడు.

జాబు రావాలంటే... కూటమి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారని విమర్శించారు. స్థానికులకు ఉద్యోగాల కోసం జీవో నంబర్ 3 తీసుకువచ్చామని... దాన్ని జగన్ రద్దు చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తికి ఓటు వేయకూడదు ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవో నెం.3 తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story