ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్

Chandrababu: అధికార వైసీపీకి కంచుకోటగా పశ్చిమ ప్రాంతం

Jyothi
Published on: 31 March 2024 2:42 PM IST
Chandrababu Special focus on Western region of Prakasam district
X

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్

Chandrababu: ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ ప్రాంతంలో ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు చంద్రబాబు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సాయంత్రం 4గంటలకు మార్కాపురం గడియార స్తంభం వద్ద జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు.

ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అధికార వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ వైసీపీ బలమైన పార్టీగా నిలిచింది. 2019 ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. వైసీపీ ఆధిక్యతను బద్దలు కొట్టి తమ హావా సాధించాలని టీడీపీ అడుగులు వేస్తోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు తొలి సభను పశ్చిమ ప్రాంతంలో నిర్వహించనున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీనిచ్చారు. అయితే ఈ రోజు ప్రజాగళం సభలో మళ్లీ ఇదే విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. మరో వైపు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు పూర్తి స్థాయిలో సాగు, తాగునీరు అందిస్తామని చంద్రబాబు హామీనిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story