Chandrababu: జగన్ ప్రభుత్వ వేధింపుల వల్లే అమరరాజా రాష్ట్రాన్ని వదిలిపోయింది

Chandrababu: ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత చంద్రబాబు.

Arun Chilukuri
Updated on: 3 Dec 2022 5:00 PM IST
Chandrababu Slams Jagan Over Amararaja Batteries
X

Chandrababu: జగన్ ప్రభుత్వ వేధింపుల వల్లే అమరరాజా రాష్ట్రాన్ని వదిలిపోయింది

Chandrababu: ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ప్రభుత్వ విధానాల వల్లే వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అమరరాజా సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందన్నారు. అమరరాజా సంస్థ 4 దశాబ్దాల ప్రస్థానంలో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పించేదని గుర్తు చేశారు. 1 బిలియన్ డాలర్ విలువైన కంపెనీ జగన్ పనితీరుతో పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయిందని ఫైర్ అయ్యారు.

ఏపీలో పుట్టిన సంస్థ తొలిసారి చిత్తూరు వదిలి రాష్ట్రం వెలుపల 9500 కోట్ల పెట్టుబడి పెడుతుంటే బాదేస్తోందన్నారు. సంస్థకు గతంలో ఇచ్చిన భూములు కూడా వెనక్కి తీసుకోవడం, తనిఖీలు, పర్యావరణ అనుమతుల పేరుతో ఇబ్బంది పెట్టడమే ఇందుకు కారణమని గుర్తు చేశారు. ఉపాధి నిచ్చే పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మీ శాడిజం చాటుకున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షలతో ప్రజల ప్రయోజనాలనే కాదు...రాష్ట్ర ప్రతిష్టనే పణంగా పెట్టారంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు చంద్రబాబు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story