Chandrababu: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్

Chandrababu: నేటితో రిమాండ్ గడువు ముస్తుండటంతో.. మరోసారి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చే ఛాన్స్

Jyothi
Published on: 5 Oct 2023 10:46 AM IST
Chandrababu Remand Will End Today
X

Chandrababu: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్

Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుంది. అయితే ఇప్పటికే ఒకసారి ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ పొడిగించింది. గత నెల 24న వర్చువల్‌గా ఏసీబీ కోర్టులో.. చంద్రబాబును జైలు అధికారులు హాజరుపర్చారు. నేటితో రిమాండ్ గడువు ముస్తుండటంతో... మరోసారి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిన్నంతా చంద్రబాబు బెయిల్.. కస్టడీ పిటిషన్లపై వాదనలు జరిగాయి. బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై న్యాయవాదులు వాదనలు విన్పించనున్నారు. నేడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పును వెలువరించే ఛాన్స్ ఉంది.

Jyothi

Jyothi

Next Story