Chandrababu: చంద్రబాబుకు రిమాండ్‌ పొడిగింపు.. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు

Chandrababu Remand Extended
x

Chandrababu: చంద్రబాబుకు రిమాండ్‌ పొడిగింపు.. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు.

Highlights

Chandrababu: చట్టానికి అందరూ సమానమే... చట్టాన్ని నేను గౌరవిస్తా

Chandrababu: చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపుపై ఏసీబీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రెండు రోజుల పాటు రిమాండ్‌ పొడిగించారు. చంద్రబాబు రిమాండ్ ఎల్లుండి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విచారణ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనది 45ఏళ్ల రాజకీయ జీవితమని చంద్రబాబు జడ్జికి తెలిపారు. తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని చంద్రబాబు అన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందని చెప్పారు. అన్యాయంగా తనను అరెస్టు చేశారని చెప్పారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని చంద్రబాబు జడ్జితో అన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories