Chandrababu Naidu: ఎన్నికల ఫలితాల అనంతరం దాడులపై చంద్రబాబు ఆరా

Chandrababu Naidu: వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Jun 2024 8:42 PM IST
Chandrababu questioned about the attacks that happened after the election results
X

Chandrababu Naidu: ఎన్నికల ఫలితాల అనంతరం దాడులపై చంద్రబాబు ఆరా

Chandrababu Naidu: ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయమై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్యాడర్‌కు చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు సైతం అప్రమత్తంగా ఉండి... ఎలాంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ క్యాడర్‌ పూర్తి సంయమనంతో ఉండాలన్నారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story