Chandrababu: ఇవాళ నెల్లూరు, దాచేపల్లిలో చంద్రబాబు బహిరంగ సభలు

Chandrababu: టీడీపీలో చేరనున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మల్లికార్జున

Shekhar G
Published on: 2 March 2024 2:40 PM IST
Chandrababu Public Meetings In Nellore And Bagepalli Today
X

Chandrababu: ఇవాళ నెల్లూరు, దాచేపల్లిలో చంద్రబాబు బహిరంగ సభలు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ నెల్లూరులో పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. చంద్రబాబు సమక్షంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు టీడీపీలో చేరనున్నారు. వారితో పాటు వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పసుపు జెండా కప్పుకోనున్నారు. వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. చంద్రబాబు సభ ఏర్పాట్లను మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వీపీఆర్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పరిశీలించారు.

నెల్లూరుతో పాటు చంద్రబాబునాయుడు దాచేపల్లిలో రా...కదలిరా బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జున. సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభకు చంద్రబాబు..ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్నారు. రాత్రి దాచేపల్లిలోనే చంద్రబాబు బస చేసే అవకాశం ఉంది. దీంతో రేపు ఉదయం చంద్రబాబు..తిరిగి వెళ్లనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story