Chandrababu: రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు.. పోలవరం వద్ద ఉద్రిక్తత..

Chandrababu: పోలవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 1 Dec 2022 6:45 PM IST
Chandrababu Protest Near Polavaram Project
X

Chandrababu: రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు.. పోలవరం వద్ద ఉద్రిక్తత..

Chandrababu: పోలవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలవరం ప్రాజెక్టు వైపు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలవరం డ్యాం సైట్ కు వెళ్లే మార్గంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. తనతో పాటు, మరో ఐదుగురు నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని ఆయన కోరారు. అనుమతి లేదంటూ పోలీసుల భారీగా మోహరించారు. పోలవరం వద్దకు భారీగా తెలుగుదేశం శ్రేణులు కూడా చేరుకున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story