Chandrababu: కృష్ణా జిల్లా పామర్రులో చంద్రబాబు ప్రజాగళం సభ

Chandrababu: జగన్‌ను ఓడించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా..?

Shashank Gullapelli
Published on: 7 April 2024 7:27 PM IST
Chandrababu Prajagalam Sabha in Pamarru Krishna District
X

Chandrababu: కృష్ణా జిల్లా పామర్రులో చంద్రబాబు ప్రజాగళం సభ

Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనతో సీఎం జగన్ విధ్వంసం చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. మూడు రాజధానుల గురించి మాట్లాడటానికి సిగ్గు, ఎగ్గు ఉందా అని ప్రశ్నించారు చంద్రబాబు... కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ ఐదేళ్లలో జగన్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడని, రైతులు ఆనందంగా ఉన్నారా..? నీళ్లు వస్తున్నాయా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ను ఓడించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా అంటూ చంద్రబాబు ప్రశ్నించగానే జనం కరతాళ ధ్వనులు చేశారు. రౌడీయిజాన్ని తరిమికొట్టాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నిరుపేదల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత కూటమిదని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story