Chandrababu: కుప్పంలో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు ప్లాన్‌

Chandrababu: కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేకపోవడంపై ప్రతిపక్షాల విమర్శలు

Rama Rao
Updated on: 20 April 2022 1:34 PM IST
Chandrababu Plans to Build a House in Kuppam | AP News Today
X

 కుప్పంలో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు ప్లాన్‌

Chandrababu: ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నారా చంద్రబాబు ఇక కుప్పం వాసి కాబోతున్నారు. ఆరు పర్యాయాలు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా పని చేసినా బాబుకు కుప్పంలో సొంత ఇళ్ళు లేదు. ఇప్పుడు ఇంటి నిర్మాణంవైపు చూపు దృష్టి సారించారు చంద్రబాబు. త్వరలోనే బాబు కుప్పంలో ఇల్లు కట్టుకుని కుప్పం వాసి కాబోతున్నారు. చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు లేకపోవడంపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయి. ఇదే విషయంపై కుప్పం ప్రజల నుంచి బాబును దూరం చేయడానికి అస్త్రంగా వాడుకున్నాయి. గత ఎన్నికల తర్వాత ఇదే బాబుకు ప్రతికూల అంశమైంది. బాగా ప్రచారంగా మారింది. దీంతో చంద్రబాబు కుప్పంలో ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. కుప్పం- పలమనేరు జాతీయ రహదారి పక్కనే భూమి కొనుగోలు చేశారు. అందులో ఇల్లు నిర్మాణం చేపడతారని తెలుస్తోంది.

ఈ నెలాఖరులో కుప్పంలో పర్యటించనున్న బాబు ఈ తతంగాన్ని పూర్తి చేయనున్నారు. భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు. ఇంటి నిర్మాణంతో పాటు బాబు కుటుంబ సభ్యులలో ఒకరిని అక్కడే ఉంచి పార్టీ వ్యవహారాలు చూడనున్నారు. పీఏలపై డిపెండ్ కాకుండా పర్సనల్ గా ప్రజలతో టచ్ లో ఉండబోతున్నారు. మొత్తం మీద అమరావతిలో ఇల్లులేకున్నా సొంత నియోజకవర్గంలో ఇంటి నిర్మాణానికి పూనుకోవడంతో కుప్పంలో కొత్త ఊపు తీసుకురానున్నారు.


Rama Rao

Rama Rao

Next Story