Chandrababu: నారావారిపల్లెలో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

Chandrababu Participated In Bhogi Celebrations In Naravaripalli
x

Chandrababu: నారావారిపల్లెలో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

Highlights

Chandrababu: కుటుంబసభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

Chandrababu: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్వగ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భోగి వేడుకల్లో పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ వేడుకల్లో నారా లోకేశ్‌తో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు నారావారిపల్లెకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఇక తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. పనికిరాని వస్తువులన్ననీ భోగి మంటలలో వేశామని అన్నారు. జీవో నెంబర్ 1 కాపీలను భోగి మంటల్లో వేసి చంద్రబాబు నిరసన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories