ఏపీలో ఐటీ నోటీసుల ప్రకంపనలు.. పరారీలో చంద్రబాబు పీఏ శ్రీనివాస రావు, మనోజ్ వాసుదేవ్‌

IT Notices: ఏపీలో ఐటీ నోటీసుల ప్రకంపనలు కొనసాగుతోన్న వేళ.. నోటీసులు అందుకున్న ఇద్దరు కీలక వ్యక్తులు పరారైనట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 8 Sept 2023 3:47 PM IST
Chandrababu PA Escapes After IT Notices
X

ఏపీలో ఐటీ నోటీసుల ప్రకంపనలు.. పరారీలో చంద్రబాబు పీఏ శ్రీనివాస రావు, మనోజ్ వాసుదేవ్‌

IT Notices: ఏపీలో ఐటీ నోటీసుల ప్రకంపనలు కొనసాగుతోన్న వేళ.. నోటీసులు అందుకున్న ఇద్దరు కీలక వ్యక్తులు పరారైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస రావుతో పాటు పలు కాంట్రాక్టుల్లో షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసిన మనోజ్ వాసుదేవ్‌ కూడా దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం. మనోజ్ వాసుదేవ్‌ సెప్టెంబర్‌ 5న దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది.

మరోవైపు మనోజ్ వాసుదేవ్‌తో లావాదేవీలు జరిపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ కూడా కనిపించడం లేదు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో పీఏ శ్రీనివాస్‌ కనిపించడం లేదు. ఆయన సెప్టెంబర్ 6నే అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఐటీ నోటీసులు వచ్చాయనే సమాచారం అందుకోగానే దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం. ఇక ఐటీ నోటీసులు అందుకున్న మరో వ్యక్తి యోగేష్ గుప్తా మాత్రం.. తాను విచారణకు హాజరవుతానని తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story