Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ..

Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. కుప్పం నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలపై లేఖ

Dhatripriya
Updated on: 30 April 2023 2:23 PM IST
Chandrababu Open Letter To AP DGP
X

Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. కుప్పం నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలపై లేఖ

Chandrababu: కుప్పం నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలు, టీడీపీ కార్యకర్తపై దాడి అంశంలో డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. స్థానిక పోలీసుల సహకారంతో వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని లేఖలో తెలిపారు. టీడీపీ నేత వి.బాలకృష్ణ పై, ఆయన ఇంటిపై వైసీపీ గూండాలు రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారన్నారు. బాలకృష్ణ కు చెందిన బైక్‌ను తగులబెట్టి ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారని మండిపడ్డారు.

వైసీపీ కారణంగా కుప్పం నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయన్నారు. తాను 1989 నుండి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని... ఇన్నాళ్లూ కుప్పం ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశంగా ఉందన్నారు. కానీ.. YSRCP నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్‌లో హింసాత్మక చర్యలు మొదలు పెట్టిందన్నారు. వైసీపీ దాడులు, హింసకు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. నిందితులను వదిలి బాధిత టీడీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, ..టీడీపీ క్యాడర్‌పై రౌడీ షీట్లు తెరుస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

వైసీపీ హింసను టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్దతిలోనే అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. దాడులకు పాల్పడుతున్న వైసీపీ గూండాలను అరెస్టు చేయకుండా కేవలం టీడీపీ క్యాడర్‌పై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఇదే తీరుతో వ్యవహరిస్తూ పోతే కుప్పంలో ప్రజాస్వామ్యం పూర్తిగా బలి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ క్యాడర్‌పై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని.. బాధితుడు అయిన బాలకృష్ణను తిరిగి కేసులతో వేధించడం కాకుండా అతనిపై దాడికి పాల్పడిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీని కోరారు.

Dhatripriya

Dhatripriya

Next Story