Chandrababu: ఏపీలో ఎన్డీయే కూటమికి 160కి పైగా సీట్లు రావాలి

Chandrababu: ప్రజలు గెలవాలంటే దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి రావాలి

Jyothi
Published on: 23 March 2024 3:05 PM IST
Chandrababu On AP Assembly Elections 2024
X

Chandrababu: ఏపీలో ఎన్డీయే కూటమికి 160కి పైగా సీట్లు రావాలి

Chandrababu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 160కి పైగా సీట్లు రావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలు గెలవాలంటే దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి రావాలన్నారు. ఎన్నికల బరిలో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు నిర్వహించిన వర్క్‌ షాపులో చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు 139మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13మంది ఎంపీ అభ్యర్థులు, ఇతర నియోజకవర్గాల ఇంచార్జీలు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణ హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే అందరం కలిశామన్నారు. పొత్తుల వల్ల టీడీపీలో కష్టపడిన 31మందికి సీట్లు ఇవ్వలేక పోయాం, వాళ్లు చేసిన త్యాగాన్ని తానెప్పుడు మర్చిపోను అన్నారు చంద్రబాబు.

Jyothi

Jyothi

Next Story