ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ.. కుప్పంలో అక్రమ మైనింగ్...

Chandrababu Naidu: ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ ను ఎన్జీటీ నిర్థారించింది...

Shireesha
Updated on: 30 April 2022 9:48 AM IST
Chandrababu Naidu Wrote a Letter to AP CS about Kuppam Illegal Mining | Live News
X

ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ.. కుప్పంలో అక్రమ మైనింగ్...

Chandrababu Naidu: కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ ను వెంటనే ఆపాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు..సీఎస్ కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వేనెంబర్ 104, 213లలో అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలన్నారు. ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ ను ఎన్జీటీ నిర్థారించిందని లేఖలో పేర్కొన్నారు.

అక్రమ మైనింగ్ పాల్పడిన వారి పేర్లు, వివరాలను తెలపాలంటూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సీఎస్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. సీఎస్ సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి మైనింగ్ పై శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చెయ్యాలని లేఖలో వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని ప్రధాన కార్యదర్శిని కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Shireesha

Shireesha

Next Story