Chandrababu Naidu: కబ్జా చేస్తే తాట తీస్తాం... వారికి చంద్రబాబు హెచ్చరికలు

Chandrababu Naidu: కబ్జా చేస్తే తాట తీస్తాం... వారికి చంద్రబాబు హెచ్చరికలు
x
Highlights

Chandrababu Naidu Warns land grabbers in AP: ఇకపై ఎవరైనా సెంటు భూమి కబ్జా చేసినా సరే వారి తాట తీస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ గ్రాబర్స్‌కు...

Chandrababu Naidu Warns land grabbers in AP: ఇకపై ఎవరైనా సెంటు భూమి కబ్జా చేసినా సరే వారి తాట తీస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ గ్రాబర్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇతరుల భూములు కబ్జాలు చేయడం, మోసాలకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం చేస్తే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో తప్పుడు సర్వేలు జరిగాయని భారీ సంఖ్యలో జనం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులు అన్నింటిపై విచారణ చేపట్టి సమస్యలు పరిష్కరిస్తాం అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందుకే ఇకపై ఎవ్వరూ ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తీసుకొచ్చామని చెబుతూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories