కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన

X
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
Highlights
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 25వ తేదీ నుంచి రెండు రోజుల పాటు కుప్పం...
Arun Chilukuri23 Feb 2021 12:01 PM GMT
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 25వ తేదీ నుంచి రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత కుప్పం రాని చంద్రబాబు తాజాగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత పర్యటనకు రావాడం రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. రెండున్నరేళ్లుగా కుప్పం నియోజకవర్గానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు వస్తే అడ్డుకుంటామని వైసీపీ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు కుప్పం రావడానికి ఉన్న అర్హత కోల్పోయారని వైసీపీ నేతలు విద్యాసాగర్, మురళి, బాబు రెడ్డి చంద్రా రెడ్డి, నితిన్ రెడ్డి మండి పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన ఊపులో ఉన్న వైసీపీ వర్గీయులు చంద్రబాబు పర్యటనలో ఎలాంటి ఆటంకాలు సృష్టిస్తారోనన్న సందిగ్ధం నెలకొంది.
Web TitleChandrababu Naidu to visit Kuppam on 25, 26 Feb
Next Story