కళా వెంకటరావు చేసిన తప్పేంటి? : చంద్రబాబు

Chandrababu Naidu strongly condemns Venkata Raos arrest
x
Highlights

వైసీపీపై చంద్రబాబు ఆగ్రహ‍ం వ్యక్తం చేశారు. ఏపీలో జరిగే అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని విమర్శించారు. ఏపీలో అమలయ్యేది ఇండియన్‌ పీనల్ కోడా లేదా...

వైసీపీపై చంద్రబాబు ఆగ్రహ‍ం వ్యక్తం చేశారు. ఏపీలో జరిగే అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని విమర్శించారు. ఏపీలో అమలయ్యేది ఇండియన్‌ పీనల్ కోడా లేదా జగన్ పీనల్ కోడా అంటూ ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. కళా వెంకట్రావును ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కళావెంకట్రావును అరెస్ట్ చేసి.. కేసు పెట్టిన విధానం దారుణమన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి తమ ప్రోగ్రాంను డిస్టర్బ్ చేయడానికి వస్తే.. అక్కడి భక్తులు అడ్డుకుంటే కళావెంకట్రావుపై కేసు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories