Chandrababu: గత ఐదేళ్లలో విధ్వంస పాలన సాగింది

Chandrababu: ఏపీలో గత ఐదేళ్లలో విధ్వంస పాలన సాగిందన్నారు సీఎం చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Aug 2024 12:55 PM IST
Chandrababu Naidu Speech in Collectors Conference
X

Chandrababu: గత ఐదేళ్లలో విధ్వంస పాలన సాగింది

Chandrababu: ఏపీలో గత ఐదేళ్లలో విధ్వంస పాలన సాగిందన్నారు సీఎం చంద్రబాబు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా వైసీపీ పాలన సాగిందని అన్నారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. మంచి పాలసీల వల్లే ప్రగతి సాధ్యమవుతుందన్న చంద్రబాబు.. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులు అంకితం కావాలని పిలుపునిచ్చారు.

అయిదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్నారని, గతంలో తాను సీఎం అయినప్పడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని... అయితే ఇప్పుడు మాత్రం ఆఫీసర్లలో మోరల్ దెబ్బతిన్నదని అన్నారు. ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఏపీ దెబ్బతిన్నదని... అధికారుల మనోభవాలను దెబ్బతీసారన్నారు. ఢిల్లీకి ఇక్కడి నుంచి వెళ్లిన వారు కేంద్రంలో, ఆర్‌బీఐలో చాలా కీలకం అయ్యారని.. వరల్డ్ బ్యాంకులో కూడా పనిచేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story