పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

Arun Chilukuri
Published on: 14 Feb 2021 7:27 PM IST
పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు
X

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పతనానికి నాంది అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికార వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. బలవంతపు ఏకగ్రీవాలతో లబ్ధిపొందాలని చూసినప్పటికీ మంత్రుల స్వగ్రామాల్లోనే వైసీపీని ఓడించారని వ్యాఖ్యానించారు. మంత్రి గౌతంరెడ్డి సొంతూరులో వైసీపీ ఓడిందని, బూతుల మంత్రి సొంతూరులోనూ టీడీపీ గెలిచిందని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అభ్యర్థులను భయపెట్టి, నామినేషన్‌ వేయకుండా చేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో విడత ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా ఓటేయలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story