Chandrababu: సీఎం గాల్లో తిరిగితే ప్రజల వరద కష్టాలు ఎలా తెలుస్తాయి?

Chandrababu: పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే సీఎం జగన్ కాలికి బురద అంటకుండా హెలికాప్టర్ లో తిరిగెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Arun Chilukuri
Updated on: 16 July 2022 8:00 PM IST
Chandrababu Naidu Slams Jagan
X

Chandrababu: సీఎం గాల్లో తిరిగితే ప్రజల వరద కష్టాలు ఎలా తెలుస్తాయి?

Chandrababu: పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే సీఎం జగన్ కాలికి బురద అంటకుండా హెలికాప్టర్ లో తిరిగెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సీఎం గాల్లో తిరిగితే ప్రజల వరద కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. నేడు వరద ప్రభావిత ప్రాంతాల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వరదల ప్రభావం, ప్రజల పరిస్థితులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ శ్రేణులు, నేతలు చేతనైన సాయం చేయాలని పిలపునిచ్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుండి సాయం అందించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story