Sadhana Deeksha: సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు

Sadhana Deeksha: కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.

Arun Chilukuri
Published on: 29 Jun 2021 4:07 PM IST
Chandrababu Naidu slams Jagan Govt in TDP Sadhana Deeksha
X

Sadhana Deeksha: సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు

Sadhana Deeksha: కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ముందు జాగ్రత్తలపై ప్రభుత్వాన్ని హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకపోగా ఎగతాళి చేశారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించమంటే తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల కూడా వితండవాదం చేశారని, 16.53 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారని, తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారని విమర్శించారు. న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడంతో సీఎం జగన్ తోక జాడించారని చంద్రబాబు అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story