Chandrababu: బాబాయ్‌, చెల్లి, చివరకు తల్లిని కూడా వదల్లేదు..

Chandrababu: విజయమ్మ రాజీనామాపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.

Arun Chilukuri
Updated on: 8 July 2022 9:00 PM IST
Chandrababu Naidu Slams Jagan
X

Chandrababu: బాబాయ్‌, చెల్లి, చివరకు తల్లిని కూడా వదల్లేదు..

Chandrababu: విజయమ్మ రాజీనామాపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అందరినీ వాడుకొని వదిలేయడం సీఎం జగన్‌ నైజమని ఆయన దుయ్యబట్టారు. బాబాయ్‌, చెల్లి, చివరకు తల్లిని కూడా వదిలేయలేదని ఫైర్‌ అయ్యారు. మొన్న చెల్లెలు పార్టీలో నుంచి వెళ్లిపోగా ఇవాళ తల్లి విజయమ్మ కూడా పార్టీని విడిచి వెళ్లిపోయిందని విమర్శించారు చంద్రబాబు. జనాగ్రహం ఏమిటో అప్పుడు జగన్‌కు తెలుస్తుందన్నారు. జగన్‌ మద్యంలో విషపదార్థాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. జే బ్రాండ్‌పై వైసీపీ ప్లీనరీలో సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అరాచక పాలన పోవాలంటే తాను ఒక్కడినే పోరాడితే చాలదని, ప్రజలు అండగా నిలబడాలని, ఇంటికొకరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story