Chandrababu: కోవర్ట్‌లను పంపించి పార్టీని ప్రక్షాళన చేస్తా..

Chandrababu: రౌడీయిజం చేయ్యడం ఒక్క నిమిషం పని అయితే అది మన విధానం కాదన్నారు చంద్రబాబు.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 7:16 PM IST
Chandrababu Naidu Public Meeting At Kuppam
X

Chandrababu: కోవర్ట్‌లను పంపించి పార్టీని ప్రక్షాళన చేస్తా..

Chandrababu: రౌడీయిజం చేయ్యడం ఒక్క నిమిషం పని అయితే అది మన విధానం కాదన్నారు చంద్రబాబు. కుప్పంలో పర్యటించిన చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ల నుంచి ఘనస్వాగతం లభించింది. కుప్పంలో డబ్బులు పంచే పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. కుప్పంలో బాగా పనిచేయాలని కార్యకర్తలకు హితబోధ చేసిన ఆయ‌న కోవర్ట్ లను పంపించి పార్టీని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు.

సీఎం జగన్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు హెచ్చరించారు. తన కార్యకర్తపై దెబ్బ పడిందంటే అది తనమీద పడినట్టేనని చంద్రబాబు తెలిపారు. తాను ఎవరినీ వదలి పెట్టానని హెచ్చరించారు. వైసీపీ ఒకింత ఇబ్బందులు పెడితే తాను పదింతలు ఇబ్బందులు పేడతానని తెలిపారు. తాను కుప్పంను సరిచేస్తాను కానీ వదలి పెట్టానని చంద్రబాబు హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story