Nara Rammurthy Naidu: దుఖం దిగమింగుకుంటూ తమ్ముడి పార్థివదేహానికి బాబు అంతిమ నివాళి, నారా రోహిత్‌కు లోకేష్ ఓదార్పు

Nara Rammurthy Naidu: దుఖం దిగమింగుకుంటూ తమ్ముడి పార్థివదేహానికి బాబు అంతిమ నివాళి, నారా రోహిత్‌కు లోకేష్ ఓదార్పు
X

Nara Rammurthy Naidu Last Rites: సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతిమ నివాళి అర్పించారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం అక్కడికి వివిధ పార్టీల నేతలు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు, మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి వరుసగా నివాళి ఘటించారు. రామ్మూర్తి నాయుడి తనయుడు, ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్‌కు, ఆయన సోదరుడు నారా గిరీష్‌కు తాము అండగా ఉన్నామని చంద్రబాబు నాయుడు ధైర్యం చెప్పి ఓదార్చారు. తండ్రి మరణంతో దిగాలుగా కూర్చున్న నారా రోహిత్‌ను మంత్రి నారా లోకేష్ దగ్గరుండి ఓదార్చడం లైవ్ విజువల్స్‌లో చూడొచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story