టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులతో చంద్రబాబు సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, పార్టీ జోనల్ ఇంచార్జీలతో సమావేశం అయ్యారు.

Arun Chilukuri
Published on: 6 Oct 2021 8:27 PM IST
టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులతో చంద్రబాబు సమావేశం
X

టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులతో చంద్రబాబు సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, పార్టీ జోనల్ ఇంచార్జీలతో సమావేశం అయ్యారు. ప్రజా సమస్యలపై పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని పార్టీ శ్రేణులను అభినందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీ సర్కారు ఆకృత్యాలను ప్రజల కోసం, రాష్ట్రం కోసం భరిస్తున్నామని, టీడీపీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో పోలీసులు, వైసీపీ గూండాలతో వీరోచితంగా పోరాడుతూ.. జైలుకు కూడా వెళ్లి వస్తున్నారన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story