Chandrababu: పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. దాదాపుగా తేల్చేసినట్టే

Chandrababu: TSలో బీజేపీతో పొత్తుపై సమయం మించిపోయింది

Shekhar G
Published on: 29 Aug 2023 5:45 PM IST
Chandrababu Naidu Key Comments On Alliances
X

Chandrababu: పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. దాదాపుగా తేల్చేసినట్టే

Chandrababu: ఎన్నికల పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు తాము సానుకూలమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరితోనైనా పొత్తులకు ఆస్కారం ఉంటుందన్నారు. అయితే ఎవరితో పొత్తు అనేది ఎన్నికల టైమ్‌లోనే తెలుస్తుందన్నారు చంద్రబాబు. పొత్తులు టీడీపీకి కొత్త కాదన్న చంద్రబాబు.. 1980 నుంచే టీడీపీ జాతీయ కూటముల్లో ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని తెలిపారు. కానీ జగన్‌ ఏపీని సర్వనాశనం చేశారని.. జగన్ విధానాలతో ఏపీకి, తెలంగాణకి పొంతన లేకుండా పోయిందన్నారు. ఇక తెలంగాణలో పోటీపై కమిటీ వేశామన్న చంద్రబాబు.. తెలంగాణలో బీజేపీతో పొత్తుపై సమయం మించిపోయిందని కామెంట్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story