ఏపీలో మరో ప్రజా ఉద్యమం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రజా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

Arun Chilukuri
Published on: 6 May 2022 4:32 PM IST
Chandrababu Naidu Gives Hint on Alliances
X

ఏపీలో మరో ప్రజా ఉద్యమం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రజా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు అవసరమైతే టీడీపీ నాయకత్వం వహిస్తుందని, చివరకు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. జగన్ పాలనలో గల్లీకో సైకో తయారవుతున్నాడని చంద్రబాబు విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టడంతో వైసీపీ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. అదేమంటే తల్లుల పెంపకం సరిగా లేదంటూ మహిళా హోంమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు చంద్రబాబు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story