Chandrababu Naidu: 1+6+3+1=11.. వైసీపీకి వచ్చిన సీట్లు 11

Chandrababu Naidu: అమరావతి రైతులు 1,631 రోజులు పోరాటం చేశారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 Jun 2024 4:30 PM IST
Chandrababu Naidu Comments On Y S Jagan
X

Chandrababu Naidu: 1+6+3+1=11.. వైసీపీకి వచ్చిన సీట్లు 11 

Chandrababu Naidu: అమరావతి రైతులు 16 వందల 31 రోజులు పోరాటం చేశారని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు. 1+6+3+1=11.. వైసీపీకి వచ్చిన సీట్లు 11 అని ఆయన విమర్శించారు. ఇది దేవుడి స్క్రిప్ట్‌ అని, ఉన్మాది బారి నుంచి రాష్ట్రాన్ని దేవుడే కాపాడాడని చంద్రబాబు చెప్పారు. AP అంటే అమరావతి, పోలవరమన్న చంద్రబాబు.. 5కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి ఒక చిరునామా అని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో అమరావతిలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. పైపులు దొంగిలించారు.. రోడ్లను విధ్వంసం చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పని ఎక్కడ ఆగిందో.. అక్కడే నిలిచిపోయిందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ సముదాయం 80 శాతం పూర్తి అయిందని వివరించారు. సెక్రటరీల బంగ్లాల్లో తుమ్మ చెట్లు మొలిచాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలో ఐకానిక్ కట్టడాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని చంద్రబాబు పేర్కొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story