Chandrababu: మతి స్థిమితం లేని ముఖ్యమంత్రి.. కోడికత్తి కేసు నిందితుడిని చంపేసి ఆ నేరం నాపై వేస్తారేమో

Chandrababu: పోలవరం ప్రాజెక్టుపై మంత్రులు బఫూన్లు మాదిరిగా మాట్లాడుతున్నారు

Shekhar G
Published on: 11 Aug 2023 7:42 AM IST
Chandrababu Naidu Comments On CM Jagan
X

Chandrababu: మతి స్థిమితం లేని ముఖ్యమంత్రి.. కోడికత్తి కేసు నిందితుడిని చంపేసి ఆ నేరం నాపై వేస్తారేమో

Chandrababu: వంశధార- నాగావళి నదుల అనుసంధానంతో పాటు గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు తెచ్చి ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానని తెలుగుదేశం అధినేత . మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఆయన ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి’ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నిర్వహించిన రోడ్డుషోకు అపూర్వ ఆధరణ లభించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా 8లక్షల ఎకరాల ఆయకట్టుకు లబ్ది చేకూరనుందన్నారు. మతి స్థిమితం లేని ముఖ్యమంత్రి.. కోడికత్తి కేసు నిందితుడిని చంపేసి ఆ నేరాన్ని తనపై నెడతారేమోనని చంద్రబాబు అనుమానం వ్యక్తంచేశారు. తాను హత్యా రాజకీయాలు చేయనని, అలా చేసే వారిని భూ స్థాపితం చేస్తానని హెచ్చరించారు.

తనకు వస్తున్న ప్రజాధరణ చూసి జగన్‌ గుండె ఆగిపోవడం ఖాయమన్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానని చెప్పిన మాటను మరిచి.. రూ.5వేల వాలంటీరు ఉద్యోగం ఇచ్చి, వారితో తప్పుడు పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పరిశ్రమలు, పెట్టుబడులు పరుగెత్తుకొస్తాయని చంద్రబాబు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story