Chandrababu: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Chandrababu Letter to the Chief Election Commissioner
x

Chandrababu: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Highlights

Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్‌ ఓట్లు, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదు

Chandrababu: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్‌ ఓట్లు, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదు చేశారు. పట్టుబడిన బోగస్‌ ఓట్ల వివరాలను లేఖతో జత చేసి సమర్పించారు. వైసీపీ నేతలతో అధికారుల కుమ్మక్కుతో పలు చోట్ల పెద్ద ఎత్తున బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. బోగస్‌, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం ద్వారా ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందన్నారు. గతంలో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్ని్కల్లో కూడా బోగస్‌ ఓట్ల తంతు నడిచిందని ఆయన గుర్తు చేశారు. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేడు అదే పునరావృతం అవుతుందన్నారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories