Chandrababu: దారపనేని నరేంద్ర అరెస్ట్‌పై డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu: నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని డీజీపీని డిమాండ్‌ చేసిన చంద్రబాబు

Jyothi
Updated on: 13 Oct 2022 1:04 PM IST
Chandrababu Letter to AP DGP Over Darapaneni Narendra Arrest
X

Chandrababu: దారపనేని నరేంద్ర అరెస్ట్‌పై డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu: టీడీపీ మీడియా కో ఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర అరెస్ట్‌పై డీజీపీకి లేఖరాశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారని, వెంటనే నరేంద్రను విడుదల చేయాలని లేఖలో డిమాండ్‌ చేశారు. రాత్రి సమయంలో నేమ్‌ బ్యాడ్జ్‌లు లేకుండా నరేంద్ర ప్లాట్‌లోకి ప్రవేశించిన ఏడుగురు వ్యక్తులు.. తాము సీఐడీ అధికారులమని చెప్పి నరేంద్రను తీసుకెళ్లారన్నారు. ప్రతిపక్ష టీడీపీ నేతలు, క్యాడర్‌ను టార్గెట్‌ చేయడంలో సీఐడీ పూర్తిగా నిమగ్నమైందని, సెక్షన్‌ 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేసి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో తెలిపారు. నరేంద్రను బేషరతుగా విడుదల చేయాలని, భవిష్యత్‌లో ఇలాంటి అక్రమ అరెస్టులు జరగకుండా చూడాలని లేఖలో డీజీపీని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

Jyothi

Jyothi

Next Story