Chandrababu: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu: రాష్ట్రంలో రోజు రోజుకు పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారు -చంద్రబాబు

Sandeep Eggoju
Published on: 8 Sept 2021 11:08 AM IST
Chandrababu Letter to AP DGP Gowtham Sawang
X

ఏపీ డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు (ఫోటో ది హన్స్ ఇండియా)

Chandrababu: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు లేఖ సంధించారు. వైసీపీ నాయకుల ఆదేశాలతో.. ప్రకాశం జిల్లాలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని లేఖలో తెలిపారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. లింగసముద్రం ఎస్సై బెదిరింపులు తట్టుకోలేక రత్తయ్య, శ్రీకాంత్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. ఈ ఘటనతో రాష్ట్రంలో పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందన్న ఆయన అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీలో పోలీసుల ప్రతిష్ఠ రోజు రోజుకు దిగజారిపోతోందని, చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వర్తించాలని కోరారు. లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story