ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందన్న ప్రచారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu key Comments on the Campaign That TDP is Going to Join NDA
x

ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందన్న ప్రచారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Highlights

Chandrababu: ఎన్డీయేలో టీడీపీ చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: ఎన్డీయేలో టీడీపీ చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వార్తలను ప్రచారం చేస్తున్నవాళ్లే అందుకు సమాధానం చెప్పాలని, ఇపుడు తానేమీ మాట్లాడబోననీ చంద్రబాబు స్పష్టం చేశారు. ఆనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకొచ్చామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పరిపాలన మీద అధిక దృష్టి పెట్టడంవల్లే పార్టీ రెండు సార్లు నష్టపోయిందని చంద్రబాబు గుర్తు చేశారు.

రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామన్నారు చంద్రబాబు. సంక్షేమ పథకాలకు ఆద్యం ముమ్మాటికీ టీడీపీనేనని తేల్చి చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆర్థిక లోటులోనూ ఏపీని తెలంగాణకంటే మెరుగ్గా ఏపీని అభివృద్ధి చేశామన్నారు. అయితే ఏపీకి రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ తప్పుడు నిర్ణయాల వల్లే ఎక్కువ నష్టం జరిగిందన్నారు చంద్రబాబు. వైసీపీ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories