Chandrababu: ప్రజాగళం పేరుతో ప్రచారానికి రెడీ అయిన చంద్రబాబు

Chandrababu: రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన

Jyothi
Published on: 27 March 2024 11:18 AM IST
Chandrababu is Ready to Campaign in the Name of Prajagalam
X

Chandrababu: ప్రజాగళం పేరుతో ప్రచారానికి రెడీ అయిన చంద్రబాబు

Chandrababu: ఏపీలో ఎన్నికల సందడి స్టార్ట్ అవ్వడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. అటు అధికార వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు రెడీ అవ్వగా.. ఇటు ప్రతిపక్ష టీడీపీ ప్రజాగళం పేరుతో ఎలక్షన్ క్యాంపెయిన్‌కు రెడీ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. కాగా ఒకే రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం కుప్పం నుంచి పలమనేరు చేరుకుని అక్కడ నిర్వహించే ప్రజాగళం తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం నగరి నియోజకవర్గం పుత్తూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లె నిర్వహించే ప్రజాగళం సభల్లోనూ పాల్గొని చంద్రబాబు ప్రసంగిస్తారు.

Jyothi

Jyothi

Next Story