చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. జగన్‌ తొందరలోనే..

Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 8 March 2022 7:04 PM IST
Chandrababu Interesting Comments on Early Elections in Andhra Pradesh
X

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. జగన్‌ తొందరలోనే..

Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తొందరలోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని జోస్యం చెప్పారు. వ్యతిరేకత పెరుగుతుందని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ అనుకుంటున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు.. ఈసారి ఎన్నికల్లో ఓడిపోయి జగన్‌ ఇంటికెళ్లడం ఖాయమని ఘంటాపధంగా అన్నారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు చంద్రబాబు. దిశ చట్టం అన్నారు.. దానికి ఇప్పటి వరకు చట్టబద్ధత లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో కట్టిన పోలీస్ స్టేషన్లకు రంగులేసి దిశ పీఎస్‌ల పేరుతో హడావిడి చేశారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి మహిళా దినోత్సవం నిర్వహించే హక్కు లేదన్నారు. మహిళలకు తాము ఇళ్లు ఇస్తే.. ఇప్పుడు ఓటీఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story