Chandrababu: నేడు చంద్రబాబు ఇన్నర్‌ రింగ్ రోడ్డులో బెయిల్‌పై విచారణ

Chandrababu: ఇప్పటికే తన వాదనలు పూర్తి చేసిన లూథ్రా

Jyothi
Updated on: 29 Sept 2023 9:30 AM IST
Chandrababu Inner Ring Road Bail Inquiry Today
X

Chandrababu: నేడు చంద్రబాబు ఇన్నర్‌ రింగ్ రోడ్డులో బెయిల్‌పై విచారణ

Chandrababu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభంకానుంది. అయితే ఈ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా ఇప్పటికే తన వాదను పూర్తి చేశారు. ఇవాళ ప్రభుత్వ తరపు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించనున్నారు.

మరోవైపు ఇదే కేసులో నారా లోకేష్ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో లోకేష్‌ను ఏ14గా చేర్చింది. దీంతో సీఐడీ అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ 20వ రోజుకు చేరుకుంది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. ఇక చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది.

Jyothi

Jyothi

Next Story