AP Assembly: నేడు సీఎం హోదాలో ఏపీ అసెంబ్లీకి చంద్రబాబు

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Jun 2024 9:27 AM IST
Chandrababu in AP Assembly as CM
X

AP Assembly: నేడు సీఎం హోదాలో ఏపీ అసెంబ్లీకి చంద్రబాబు

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత సీఎం హోదాలో సభలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు చంద్రబాబు. నాటి వైసీపీ ప్రభుత్వం తన కుటుంబసభ్యులను దారుణ వ్యాఖ్యలతో అవమానించిందని శపథం చేసి సభ నుంచి వెళ్లిపోయారు చంద్రబాబు. శాసనసభ కాదు, కౌరవసభ అంటూ ఆవేదనతో నిష్క్రమించారు. మళ్లీ తిరిగి గౌరవ సభగానే ప్రవేశిస్తానంటూ వెళ్లిపోయారు చంద్రబాబు. 2021 నవంబర్ 19 తర్వాత మళ్లీ అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టలేదు. ప్రస్తుతం ఆయన 4వ సారి సీఎం హోదాలో సభలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‎

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story