Vundavalli Sridevi: నేను కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఆదుకున్నారు.. పార్టీ మార్పుపై ఏమన్నారంటే..?

Vundavalli Sridevi: చంద్రబాబును ప్రత్యేకంగా కలిసి మాట్లాడా

Shekhar G
Published on: 11 Aug 2023 3:00 PM IST
Chandrababu Helped Me When I Was In Trouble Says Vundavalli Sridevi
X

Vundavalli Sridevi: నేను కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఆదుకున్నారు.. పార్టీ మార్పుపై ఏమన్నారంటే..?

Vundavalli Sridevi: తాను కష్టాలు పడుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్‌ తనను ఆదుకున్నారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గూనభద్రలో చంద్రబాబు పర్యటనలో ఆయనను ప్రత్యేకంగా కలిసి మాట్లాడానని తెలిపారు. వైసీపీ గుండాలు తన మీద దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె... రాష్ట్రంలో దిశ చట్టం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను రక్షణ కోసం తెలంగాణలో ఉంటున్నానన్నారు. తనకు రక్షణ కల్పించాలని చంద్రబాబును అడిగితే ఆయన ఓకే అన్నారని శ్రీదేవి చెప్పారు. రానున్న రోజుల్లో ఏ పార్టీలో చేరాలో ఆలోచించానని, గత నాలుగు నెలల్లో చంద్రబాబు పాలన, జగన్ పాలన బేరీజు వేసుకున్నానని, ఓ మంచి రోజు చూసి నిర్ణయం చెబుతానని వెల్లడించారామె. ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story