ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
x
Highlights

వైసీపీ అవినీతిని బయటపెట్టినందుకే సీఆర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డిని హత్య చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గురుప్రతాప్ రెడ్డి...

వైసీపీ అవినీతిని బయటపెట్టినందుకే సీఆర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డిని హత్య చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గురుప్రతాప్ రెడ్డి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. గండికోట పరిహారం చెల్లింపులో అక్రమాలు బయట పెట్టాడనే కక్షతోనే గురుప్రతాప్ రెడ్డిని హతమార్చారని ఆరోపించారు. అధికార పార్టీ అవినీతిపై ప్రశ్నించేవారిని వేధిస్తున్నారని, అవినీతి సమాచారం వెల్లడించిన వారిని హత్య చేయడం దారుణమన్నారు. రాష్ర్టంలో పేదలను హింసించడం హతమార్చడం సర్వసాధారణంగా మారిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు నేరాల సంఖ్య రోజురోజుకూ మితిమీరిపోతున్నా, శాంతిభద్రతలు గణనీయంగా క్షీణిస్తున్నా, భయానక నేరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories