Chandrababu: నేడు గొల్లపూడికి వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu: దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించనున్న బాబు

Sandeep Eggoju
Updated on: 31 July 2021 1:42 PM IST
Chandrababu Going to the Gollapudi Today
X
ఈ రోజు గొల్లపూడి వెళ్లనున్న చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Chandrababu: ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా గొల్లపూడి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గొల్లపూడి వెళ్లనున్న ఆయన మాజీమంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉమా కుటుంబసభ్యులకు భరోసా ఇవ్వనున్నారు చంద్రబాబు.

మరోవైపు చంద్రబాబు గొల్లపూడి పర్యటనతో మైలవరం నియోజకవర్గ దళితసంఘాలు ఆయన్ను కలిసేందుకు సిద్ధమయ్యాయి. నియోజకవర్గంలో తమపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని చంద్రబాబుకు ఫిర్యాదు చేయనున్నారు దళిత సంఘాల నేతలు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story