చంద్రబాబుకు సుప్రీంలో ఊరట: సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ల కొట్టివేత

చంద్రబాబుకు సుప్రీంలో ఊరట: సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ల కొట్టివేత
x
Highlights

చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

Chandrababu Naidu: చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.చంద్రబాబు ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కి బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఇలాంటి పిటిషన్లను కూడా వాదిస్తారా అని కోర్టు ప్రశ్నించింది. సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బాలయ్య దాఖలు చేశారు.ఒక్క మాట కూడా మాట్లాడవద్దని పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. పిటిషన్ పై ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని కోర్టు వార్నింగ్ ఇచ్చింది.ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి వాటిపై జగన్ ప్రభుత్వం సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ అధికారానికి దూరమయ్యారు. జగన్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నన చంద్రబాబు కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ కేసుల విచారణను సీఐడీకి బదులుగా సీబీఐకి బదిలీ చేయాలని న్యాయవాది బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ మణీందర్ సింగ్ వాదనలకు సిద్దమైన సమయంలో ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories