చంద్రయ్య పాడె మోసిన చంద్రబాబు.. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ తరపున 25 లక్షల ఆర్థిక సాయం

Chandrababu: హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.

Arun Chilukuri
Published on: 13 Jan 2022 9:18 PM IST
Chandrababu Flays YSRCP Govt Over Death of TDP Activist
X

చంద్రయ్య పాడె మోసిన చంద్రబాబు.. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ తరపున 25 లక్షల ఆర్థిక సాయం

Chandrababu: హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ ఫ్యాక్షన్ హత్యలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. అధికారం పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, తాము అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ లీడర్లపై కచ్చితంగా చర్యలుంటాయని చంద్రబాబు మండిపడ్డారు. హత్యా రాజకీయాలకు తెలుగు దేశం పాల్పడి ఉంటే ఈరోజు వైసీపీ నేతలు మిగిలేవారా అని ఆయన ప్రశ్నించారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే చంద్రయ్య ఆశయమన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటానికి నన్ను పిలవాలనుకుంటే చంద్రయ్య అంత్యక్రియలకు తాను రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. 25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. చంద్రయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడేను స్వయంగా చంద్రబాబు మోసుకెళ్లారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story