నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్‌నెట్‌ కేసు విచారణ

Chandrababu: సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన చంద్రబాబు

Jyothi
Published on: 17 Jan 2024 8:20 AM IST
Chandrababu Fibernet case hearing in Supreme Court today
X

నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్‌నెట్‌ కేసు విచారణ

Chandrababu: సుప్రీంకోర్టులో ఇవాళ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఫైబర్‌నెట్ స్కాంలో ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బోస్, త్రివేది ధర్మాసనం విచారించనుంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు అనంతరం ఫైబర్‌నెట్‌పై విచారణ జరుపుతామని గతంలో ధర్మాసనం తెలిపింది. అయితే చంద్రబాబు అరెస్టులో 17ఏ వర్తింపుపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించకపోవడంతో.. ఫైబర్ నెట్ స్కాంలో విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Jyothi

Jyothi

Next Story