బాబుకు 2019 చేదు జ్ఞాపకాలు బైబై చెబితే.. 2020 పెను సవాళ్లు

బాబుకు 2019 చేదు జ్ఞాపకాలు బైబై చెబితే.. 2020 పెను సవాళ్లు
x
Highlights

ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ. కానీ 2019 ఆయన్ను ఒక చూపు చూసింది. అయితే ట్వంటీ ట్వంటీ కూడా, అంతే సమరోత్సాహంతో, ఆ అధినాయకుడిని ఢీ కొడతానంటోంది. రకరకాల...

ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ. కానీ 2019 ఆయన్ను ఒక చూపు చూసింది. అయితే ట్వంటీ ట్వంటీ కూడా, అంతే సమరోత్సాహంతో, ఆ అధినాయకుడిని ఢీ కొడతానంటోంది. రకరకాల ఆయుధాలతో యుద్ధమంటోంది. మరి ఆ వెటరన్‌ ప్లేయర్, ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌‌లో సత్తా చాటగలడా టీంను కాపాడుకోగలడా కళ్లముందు చెదిరిపోతున్న తన కలను పదిలం చేసుకోగలడా?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, 2019 చేదు జ్నపకాలతో బైబై చెబితే, 2020 అంతకంటే పెను సవాళ్లతో సమరమంటోంది. ఇప్పటికే పార్టీలో సంక్షోభం, వారసత్వ సందిగ్దం‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు, ట్వంటీ ఆడేందుకు సిద్దమవుతున్న కొత్తేడాదిని తలచుకుంటూనే టెన్షన్‌ పడిపోతున్నారట.

చంద్రబాబు కలల రాజధాని అమరావతి, 2020లో వైజాగ్‌కు తరలిపోవడం ఖాయమన్న అంచనాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే చంద్రబాబుకే కాదు, టీడీపీలో కీలక నేతలందరికీ పెను సవాలే. ఎందుకంటే, వైసీపీ ఆరోపిస్తున్నట్టు అమరావతిలో వందల ఎకరాలు కొని, కోట్లలో పెట్టుబడి పెట్టారట టీడీపీ నేతలు. ఇప్పుడు రాజధాని తరలిపోతే, ఆర్థికంగా కొందరు టీడీపీ నేతలకు భారీ నష్టమన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు, తన సామాజికవర్గం నుంచి కూడా బాబుకు కొంత ప్రతిఘటన ఎదురయ్యే ప్రమాదముందన్న సంకేతాలు కనపడ్తన్నాయి. ఎందుకంటే, ఐదేళ్లలో పూర్తిస్థాయిలో రాజధానిని నిర్మించి వుంటే, ఇప్పుడు రాజధాని తరలింపుకు అవకాశమే వుండేదికాదని, తాత్కాలిక భవనాలంటూ బాబు చాలా ఆలస్యం చేశారని కొందరు టీడీపీ నేతలే లోలోపల రగిలిపోతున్నారు. తాత్కాలికమైనందుకే, రాజధానిని తరలించే సాహసం జగన్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. రాజధాని తరలింపు ప్రతిపాదన , నిజంగా కొత్తేడాది బాబుకు ఇవ్వబోతున్న షాకే. అంతేకాదు, మూడు రాజధానులను వ్యతికిస్తే అటు ఉత్తరాంధ్ర, రాయలసీమలోనూ టీడీపీకి ఎదురుగాలి తప్పదు. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

వున్న కొందరు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా, బాబుకు పెను సవాలే. ఇప్పటికే వంశీ, గిరి వైసీపీకి దగ్గరయ్యారు. 2020లో మిగిలినవారిలో చాలామంది వంశీ చూపిన ప్రత్యేక బాటలోనే పయనిస్తారన్న అంచనాలు పెరుగుతున్నాయి. వైసీపీలో వీరెవరూ అధికారికంగా చేరలేదు కాబట్టి, అధికార పార్టీని విమర్శించడానికి పెద్దగా స్కోపులేదు. గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించారు కాబట్టి, జంపింగ్‌లను ఖండించే నైతిక హక్కు కూడా బాబుకు లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఘోర ఓటమితో బాగా చితికిపోయిన టీడీపీలో హుషారు నింపడం, నేతలు, ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవడం, లోకేష్‌ నాయకత్వం అందరికీ ఆమోదయోగ్యంలా మలచడం, బాబుకు 2020 విసురుతున్న సవాళ్లు.

మున్సిపల్, పంచాయతీ ఎన్నికల రూపంలో చంద్రబాబు చాలెంజ్ విసురుతోంది కొత్తేడాది. స్థానిక ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకే విజయాలెక్కువుంటాయి. అసలే అసెంబ్లీలో ఘోర పరాజయం, దీనికితోడు మూడు రాజధానుల వ్యవహారం స్థానిక ఎన్నికల్లో బాబును ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. మొత్తానికి అనేక చాలెంజెస్‌తో 2020 చంద్రబాబును ఢీకొడుతోంది. మరి వీటన్నింటినీ చంద్రబాబు ఎలా అధిగమిస్తారో, కాలమే సమాధానం చెప్పాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories