నిడదవోలు నియోజకవర్గంలో అడుగుపెట్టిన చంద్రబాబు... చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

కుందుల స్వగ్రామం తీపర్రు నుంచి నిడదవోలు వరకు భారీ ర్యాలీ

R Tripura Malini
Published on: 2 Dec 2022 12:24 PM IST
Chandrababu Entered Nidadavolu Constituency
X

నిడదవోలు నియోజకవర్గంలో అడుగుపెట్టిన చంద్రబాబు... చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

Chandrababu Naidu: టీడీపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబుకి ఘనస్వాగతం పలకడానికి నిడదవోలు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో.. టీడీపీ నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. కుందుల స్వగ్రామం తీపర్రు నుంచి నిడదవోలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత కుందుల సత్యనారాయణ ఈర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు వేలాది బైకులు, కార్లతో తీపర్రు నుంచి నిడదవోలు వరకు ర్యాలీగా వచ్చి చంద్రబాబుకి సంఘీభావం తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story