Chandrababu:పెట్రో బాదుడులో జగనే టాప్..

Chandrababu: పెట్రోల్‌, డీజిల్, గ్యాస్‌ ధరల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Arun Chilukuri
Updated on: 23 May 2022 9:31 PM IST
Chandrababu Demands Jagan Govt to Slash Taxes on Fuel
X

Chandrababu:పెట్రో బాదుడులో జగనే టాప్.. 

Chandrababu: పెట్రోల్‌, డీజిల్, గ్యాస్‌ ధరల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించుకోవాలని కేంద్రం సూచించడం ప్రశంసనీయమన్నారు. అయితే పెట్రోల్ ధరలు తగ్గించని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికే కేంద్రం పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు పన్ను తగ్గించిందని..రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయని గుర్తు చేశారు.

తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం... ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఎందుకు పన్నులు తగ్గించడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. పెట్రో పన్ను తగ్గించి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. ఎన్ని విజ్జప్తులు చేసినా ప్రజలు భారం మోయలేకపోతున్నారని చంద్రబాబు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story