Chandrababu: నన్ను చంపాలని చూశారు.. సీబీఐ విచార‌ణ‌కు చంద్ర‌బాబు డిమాండ్..

Chandrababu: అన్నమయ్య జిల్లా అంగళ్లులో టీడీపీ కార్యకర్తలపై ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 9 Aug 2023 3:35 PM IST
Chandrababu demands CBI inquiry on Punganur violence
X

Chandrababu: నన్ను చంపాలని చూశారు.. సీబీఐ విచార‌ణ‌కు చంద్ర‌బాబు డిమాండ్..

Chandrababu: అన్నమయ్య జిల్లా అంగళ్లులో టీడీపీ కార్యకర్తలపై ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తనను చంపడానికి ఎవరు ప్లాన్‌ చేస్తున్నారో ఈ విచారణలో తేలాలన్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా అని నిలదీశారు. అంగళ్లులో తమపై దాడికి పాల్పడి తనపైనే తిరిగి హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆరోపించారు. దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. సైకో సీఎం ఆదేశాల ప్రకారమే.. తనని ప్రజల మధ్య తిరగనీయకుండా చేయడానినే ఈ కేసులు పెడుతున్నారన్నారు. దాడికి కుట్ర జరిగితే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story