Chandrababu: హస్తినకు చంద్రబాబు.. టీడీపీతో పొత్తుపై బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం..

Chandrababu Delhi Tour: త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Arun Chilukuri
Updated on: 6 Feb 2024 7:15 PM IST
Chandrababu Delhi Tour Tomorrow Likely
X

Chandrababu: హస్తినకు చంద్రబాబు.. టీడీపీతో పొత్తుపై బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం..

Chandrababu Delhi Tour: త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ లేదా రేపు ఆయన హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలను చంద్రబాబు కలవనున్నారు. టీడీపీతో పొత్తుపై బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. సీట్ల పంపకాలపై, ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. కాగా ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్‌ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు.. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ వస్తుందని నేతలు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story