Srisailam: మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు

Srisailam: చంద్రబాబు దంపతులకు ఆలయమర్యాదలతో స్వాగతం

Shashank Gullapelli
Published on: 22 April 2024 4:06 PM IST
Chandrababu Couple In Mallanna Service
X

Srisailam: మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు 

Srisailam: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి సున్నిపెంట హెలిపాడ్ కు చేరుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో చంద్రబాబు దంపతులు శ్రీ సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ మర్యాదలతో చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. మల్లిఖార్జునస్వామికిృ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆలయ అర్దకులు, వేదపండితులు వేద ఆశీర్వచనాలు అంద చేయగా.. ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల ప్రసాదం, శేష వస్త్రాలు, స్వామిఅమ్మవారి చిత్రపటాన్ని అంద చేశారు. స్వామి వారి దర్శనం చేసుకున్న చంద్రబాబు దంపతులు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story